ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 09:51:43

కాలిఫోర్నియాలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం

కాలిఫోర్నియాలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం

శాక్రమెంటో : కరోనా కేసులు  పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాలిఫోర్నియాలో లాక్‌డౌప్‌ నిబంధనలను కఠినతరం చేయాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. వ్యాపారాలు, బహిరంగ ప్రదేశాలపై ఆంక్షలను తిరిగి విధించింది. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్ర గవర్నర్‌ గావిన్ న్యూసోమ్ మాట్లాడుతూ రెస్టారెంట్లు, బార్‌లు, థియేటర్లు, వినోద వేదికలు, జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలతో పాటు అన్ని ఇండోర్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కౌంటీలు, ప్రార్ధనా మందిరాలు, జిమ్‌లు, క్షౌరశాలలు కూడా మూసివేయబడతాయని పేర్కొన్నారు. అక్కడ ఆంక్షలు ఎత్లివేసిన తరువాత కరోనా కేసులు 20శాతం పెరుగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 3,30,000కు పైనే కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 7,000 మందికి పైగా మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo