శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 20, 2020 , 21:12:47

న్యూజీలాండ్‌లో లాక్‌డౌన్ మ‌రోసారి పొడ‌గింపు

 న్యూజీలాండ్‌లో లాక్‌డౌన్ మ‌రోసారి పొడ‌గింపు

క‌రోనా నియంత్ర‌ణ‌కు న్యూజీలాండ్ లో లాక్‌డౌన్ మ‌రో 5రోజుల పాటు పొడ‌గించారు. దేశంలో కరోనా వ్యాప్తి మరింత తగ్గించేందుకు పొడ‌గింపు త‌ప్ప‌లేద‌ని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా మరో ఐదు రోజులు లాక్డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటన చేశారు. వాస్తవానికి లాక్డౌన్ ఇప్ప‌టికే ముగియాల్సి ఉండ‌గా...మ‌రో 5రోజులు పొడ‌గించారు. అటు ఇతర దేశాల కంటే తామే కరోనాను బాగా అరికట్టామని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు.అయితే  ఏప్రిల్ 28 నుండి లాక్డౌన్  కొద్దిగా స‌డ‌లిస్తామ‌ని అన్ని పరిశ్రమలు, దుకాణాలకు అనుమ‌తులు ఇస్తామ‌ని చెప్పారు. అయితే సామాజిక దూరం కచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగడం లేదని న్యూజిలాండ్ ఆరోగ్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకు న్యూజిలాండ్ లో 1,440 మందికి వ్యాధి సోకగా... 12 మంది మరణించారు.
logo