సోమవారం 01 జూన్ 2020
International - Apr 11, 2020 , 11:45:31

ఇట‌లీలో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు..

ఇట‌లీలో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు..

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్‌ను మే నెల‌ 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇట‌లీ ప్ర‌దాని గుసెప్పి కాంటే తెలిపారు. అయితే ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత మాత్రం కొన్ని షాపులు తెరుచుకునే రీతిలో అనుమ‌తి ఇస్తామ‌న్నారు.  ఇది క‌ష్ట‌మైన నిర్ణ‌య‌మే కానీ, రాజ‌కీయ బాధ్య‌త తాను తీసుకోనున్న‌ట్లు ప్ర‌ధాని కాంటె తెలిపారు. మార్చి 9వ తేదీ నుంచి ఇట‌లీలో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించారు.  షాపుల‌ను, బిజినెస్ సెంట‌ర్ల‌ను మూసివేశారు. అయితే సోమ‌వారం ఆ ఆంక్ష‌లు ముగియ‌నున్న నేప‌థ్యంలో.. ప్ర‌దాని కాంటే మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పారు. ఇట‌లీలో ల‌క్ష‌న్న‌ర మందికి వైర‌స్ సంక్ర‌మించ‌గా, సుమారు 19 వేల మంది మ‌ర‌ణించారు. యూరోప్‌లో అత్య‌ధిక మ‌ర‌ణాలు న‌మోదైంది ఇట‌లీలోనే. logo