గురువారం 04 జూన్ 2020
International - Apr 24, 2020 , 21:43:58

పాకిస్తాన్‌లోనూ లాక్‌డౌన్ పొడ‌గింపు

పాకిస్తాన్‌లోనూ లాక్‌డౌన్ పొడ‌గింపు

ఇస్లామాబాద్: కరోనా రోజురోజుకు విస్త‌రిస్తున్న క్ర‌మంలో దాయాది దేశం పాకిస్తాన్ మ‌రోసారి లాక్‌డౌన్ పొడ‌గించింది. రంజాన్ వేళ లాక్‌డౌన్ పొడ‌గింపు స‌రైన మార్గ‌మ‌ని భావించింది. అందుకు‌ మే 9 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  పాకిస్తాన్‌ కేసులు పెరుగుతుండ‌టంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివర‌కు  దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,155 కు చేరుకుంది.  క‌రోనాతో 237 మంది మరణించగా.. 2,537 మంది కోలుకున్నారు. దేశంలో 79 శాతం కేసులు లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా నమోదైనవేనని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మే నెలాఖరు లేదా జూన్‌ ప్రారంభం వరకు కేసుల పెరుగుదల ఉండ‌వ‌చ్చ‌ని అక్క‌డి ఆరోగ్యశాఖ అంచనావేసింది. ఇక రంజాన్‌ మొదలు కావడంతో షరతులతో కూడిన ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 


logo