గురువారం 28 మే 2020
International - Apr 26, 2020 , 20:16:40

నేపాల్ లో లాక్ డౌన్ పొడిగింపు

నేపాల్ లో లాక్ డౌన్ పొడిగింపు

ఖాట్మండ్: క‌‌రోనా వైర‌స్ పై పోరు చేసేందుకు నేపాల్ దేశం లాక్ డౌన్ కాలాన్ని పొడిగించింది. లాక్ డౌన్ 10 రోజుల‌పాటు  మే 7 వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు నేపాల్ ప్ర‌ధాని సెక్ర‌టేరియ‌ట్ కార్యాల‌యం వెల్ల‌డించింది. మినిస్ట‌ర్స్ కౌన్సిల్ ఇవాళ స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యం తీసుకుంది.

నేపాల్ లో 52 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..16 మంది కోలుకున్నారు. తొలుత ఏప్రిల్ 27న లాక్ డౌన్ ముగియాల్సి ఉండ‌గా..తాజా నిర్ణ‌యంతో బుద్ధ జయంతి రోజున లాక్ డౌన్ ను ఎత్తివేయ‌నుంది నేపాల్ ప్ర‌భుత్వం. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo