బుధవారం 03 జూన్ 2020
International - Apr 19, 2020 , 07:41:44

స్పెయిన్ లో లాక్ డౌన్ పొడిగింపు

స్పెయిన్ లో లాక్ డౌన్ పొడిగింపు

మాడ్రిడ్ : క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌పంచ‌దేశాల్లో ఒక్క స్పెయిన్ దేశం ఎంత మొత్తంలో న‌ష్ట‌పోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. క‌రోనా ధాటికి స్పెయిన్ లో అత్య‌ధికంగా 29,043 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో స్పెయిన్ లో లాక్ డౌన్ ను మే 9 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని పెడ్రో సాంచెజ్ ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 27 నుంచి ఆంక్ష‌ల‌పై స‌డ‌లింపులు ఇస్తామ‌ని పేర్కొన్నారు. 

మార్చి 14నుంచి స్పెయిన్ లో లాక్ డౌన్ అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే. సామాజిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, బాధ్య‌తతో చాలా క‌ష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితుల‌ను అధిగ‌మిస్తున్నాం. మేం అత్యంత తీవ్ర‌మైన క్ష‌ణాలను గ‌డుపుతున్నామ‌ని అంత‌కుముందు ప్ర‌ధాని సాంచెజ్ పేర్కొన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక కేసులు న‌మోదైన రెండో దేశంగా స్పెయిన్ ఉండ‌గా..ఇప్ప‌టివ‌ర‌కు స్పెయిన్ లో ల‌క్షా 90వేల‌కు పైగా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo