బుధవారం 03 జూన్ 2020
International - May 11, 2020 , 11:39:53

మెల్ల‌మెల్ల‌గా తెరుచుకుంటున్న యూరోప్‌..

మెల్ల‌మెల్ల‌గా తెరుచుకుంటున్న యూరోప్‌..

హైద‌రాబాద్‌: యూరోప్ దేశాలు మెల్ల‌మెల్ల‌గా లాక్‌డౌన్ నుంచి బ‌య‌ట‌కువ‌స్తున్నాయి. రెండ‌వ ద‌ఫా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు కావ‌న్న ఉద్దేశంతో ఆయా దేశాలు స‌డ‌లింపులు ప్ర‌క‌టిస్తున్నాయి.  ఫ్రాన్స్‌లో ప్రైమ‌రీ స్కూళ్లు స్వ‌ల్ప సంఖ్య విద్యార్థుల‌తో ప్రారంభించ‌నున్నాయి. వ‌స్త్ర దుకాణాలు, బుక్‌షాపులు, హెయిర్ సెలూన్లు, పూల దుకాణాలు తెరుచుకోనున్నాయి.  రెస్టారెంట్లు, సినిమాలు, బార్లు మాత్రం మూసి ఉంచ‌నున్నారు. ఇక బెల్జియంలో కూడా దాదాపు వ్యాపారాల‌న్నింటినీ ఓపెన్ చేయ‌నున్నారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ క‌చ్చితంగా పాటించాల్సిందే. బెల్జియంలో కూడా రెస్టారెంట్లు, బార్లు, కేఫ్‌ల‌ను మూసి వేస్తున్నారు. 

నెద‌ర్లాండ్స్‌లో ప్రైమ‌రీ స్కూళ్ల‌ను నేటి నుంచి తెరుస్తున్నారు.  లైబ్ర‌రీలు, ఫిజియోథెర‌పిస్టులు, డ్రైవింగ్ స్కూళ్లు, సెలూన్ల‌ను కూడా ఓపెన్ చేస్తున్నారు.  స్విట్జ‌ర్లాండ్‌లో ప్రైమ‌రీ, మిడిల్ స్కూల్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. అయితే క్లాసుల్లో విద్యార్థుల సంఖ్య‌ను త‌గ్గించ‌నున్నారు. కొన్ని నిబంధ‌న‌ల మ‌ధ్య‌ రెస్టారెంట్లు, బుక్‌షాపులు, మ్యూజియంల‌ను కూడా ఓపెన్ చేస్తున్నారు. స్పెయిన్‌లో ప‌ది మంది ఒక ద‌గ్గ‌ర స‌మావేశం అయ్యేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఔట్‌డోర్‌లో ఉన్న రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమ‌తి క‌ల్పించారు. కానీ సోష‌ల్ డిస్టాన్సింగ్ త‌ప్ప‌నిస‌రి.  

ఇంగ్లండ్‌లోనూ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఈ వార‌మే స‌డ‌లించ‌నున్నారు. యునైటెడ్ కింగ్డ‌మ్‌లోని ఇత‌ర ప్ర‌దేశాల్లో కొంత వ‌ర‌కు క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్నారు. డెన్మార్క్‌లో షాపింగ్ సెంట‌ర్ల‌ను ఓపెన్ చేశారు. పోలాండ్‌లో నేటి నుంచి హోట‌ళ్ల‌ను కూడా తెరుస్తున్నారు. ఇక విదేశాల నుంచి వ‌చ్చే టూరిస్టులు మాత్రం క‌చ్చితంగా రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాలి.  యూరోప్‌లోని జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, ఇట‌లీ లాంటి దేశాలు కూడా మెల్ల‌మెల్ల‌గా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నాయి. logo