శనివారం 30 మే 2020
International - Mar 28, 2020 , 15:56:58

లండన్‌లో ఆరునెలల లాక్‌డౌన్‌!

లండన్‌లో ఆరునెలల లాక్‌డౌన్‌!

కరోనా మహమ్మారికి ప్రపంచం వణికిపోతుంది. పలు దేశాల నాయకులు, ప్రజాప్రతినిధులు దీని బారినపడుతున్నారు. దీంతో లండన్‌లో కరోనాను ఎలా అదుపు చేయాలో తెలీక అక్కడి ఆఫీసర్లు తలలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ త్రీవ ఆంక్షలతో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జెన్నీ హ్యారిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ను మరో అరునెలలపాటు పొడిగించే అవకాశం ఉందని, ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ఆంక్షల తీవ్రత తగ్గుతుందన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అనేకమంది రెండు నుంచి మూడు వారాల క్రితం కొవిడ్‌-19 బారిన పడ్డారని, రబోయే రోజుల్లో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని తెలిపారు. 


logo