గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 08:56:38

లింకన్‌ తల వెంట్రుకలు వేలం.. రూ.59 లక్షలు ప‌లికిన ధ‌ర‌

లింకన్‌ తల వెంట్రుకలు వేలం.. రూ.59 లక్షలు ప‌లికిన ధ‌ర‌

బోస్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ తల వెంట్రుకలు, రక్తంతో తడిసిన టెలిగ్రాం రూ.59.51 లక్షల (81 వేల డాలర్లకు పైగా)కు పైగా వేలంలో అమ్ముడయ్యాయి. అమెరికాలోని బోస్టన్‌లో ఆర్‌ఆర్‌ ఆక్షన్‌ సంస్థ నిర్వహించిన వీటి వేలం శనివారం ముగిసింది. వాటిని కొనుగోలు చేసిన వారి పేరును సదరు సంస్థ బహిర్గతం చేయలేదు. 

1865లో లింకన్‌ హత్యకు గురైన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించినప్పుడు 2 అంగుళాల (5 సెం.మీ) పొడవు గల ఆయన వెంట్రుకలను తొలిగించారు. అటుపై ఆ వెంట్రుకల క్లిప్పింగ్‌ను వైద్యులు అక్కడే ఉన్న లింకన్‌ భార్య మేరి టోడ్‌ లింకన్‌ బంధువు, కెంటకీ పోస్ట్‌మాస్టర్‌ డాక్టర్‌ ల్యామన్‌ బీచర్‌ టోడ్‌కు అప్పగించారు. నాటి నుంచి సదరు వెంట్రుకల క్లిప్పింగ్‌ 1945 వరకు తమ ఆధీనంలోనే ఉందని డాక్టర్‌ లోడ్‌ తనయుడు జేమ్స్‌ టోడ్‌ తెలిపారు. దాన్ని 1999లో విక్రయించారని ఆర్‌ఆర్‌ ఆక్షన్‌ తెలిపింది. 


logo