మంగళవారం 26 మే 2020
International - Apr 14, 2020 , 15:19:39

నేపాల్‌లో ఏప్రిల్ 27 వ‌ర‌కు లాక్‌డౌన్‌

నేపాల్‌లో ఏప్రిల్ 27 వ‌ర‌కు లాక్‌డౌన్‌

న్యూఢిల్లీ: ప్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి నేపాల్ ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 27 వ‌ర‌కు పొడిగించింది. నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి నేతృత్వంలో జ‌రిగిన క్యాబినెట్‌ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో కొవిడ్‌-19 క‌ట్ట‌డిపై అధ్య‌య‌నం కోసం ఇటీవ‌ల నేపాల్ స‌ర్కారు హైలెవ‌ల్ క‌మిటీని ఏర్పాటు చేయ‌గా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆ క‌మిటీ సూచించింది. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాలు పొడిగించింది. నేపాల్‌లో మార్చి 24 నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. బుధ‌వారం అర్థ‌రాత్రితో 21 రోజుల లాక్‌డౌన్ యుగియ‌నున్న నేప‌థ్యంలో.. మ‌రోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు. కాగా, నేపాల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 16 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.    

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo