ఆదివారం 31 మే 2020
International - May 06, 2020 , 18:47:31

నేపాల్‌లో మే 18 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

నేపాల్‌లో మే 18 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఖాట్మండు: నేపాల్‌లో లాక్‌డౌన్‌ను మే 18 వరకు పొడిగించారు. బుధవారం సాయంత్రం బలువతార్‌లో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంలో జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ముందుగా మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ విధించారు. అనంతరం ఏప్రిల్‌ 15 నుంచి 27 వరకు ఒకసారి, ఏప్రిల్‌ 27 నుంచి మే 8 వరకు మరోసారి లాక్‌డౌన్‌ పీరియడ్‌ను పొడిగించారు. తాజగా మరోసారి మే 18 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులపై కూడా క్యాబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. నేపాల్‌లో కొవిడ్‌-19 నిర్మూలన కోసం వేసిన హైలెవల్‌ ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కేసుల సంఖ్య ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాలను గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లుగా విభజించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఇవ్వాలని సూచించింది. 


logo