శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 17:13:53

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వైఫైతో హోంవర్క్‌.. నెటిజన్ల మనసు గెలుచుకున్న అక్కాచెల్లెలు!

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వైఫైతో హోంవర్క్‌.. నెటిజన్ల మనసు గెలుచుకున్న అక్కాచెల్లెలు!

కాలిఫోర్నియా: మనకు ఇంట్లో వైఫై ఉండి, మంచి డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌తోపాటు సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ ఉన్నా పని చేసేందుకు ఒక్కోసారి బద్దకిస్తుంటాం. కానీ, ఓ ఇద్దరు అక్కాచెల్లెలు తమ హోంవర్క్‌ పూర్తి చేసేందుకు వైఫై అసరముండడంతో ఓ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్ ఎదుట కూర్చున్నారు. ఆ రెస్టారెంట్‌ ఫ్రీ వైఫైని వాడుకుని తమ పని పూర్తిచేసుకున్నారు. దీన్ని ఒకరు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా, నెటిజన్లు స్పందించారు. వారిని అభినందించడంతోపాటు వారికి కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు. 

కాలిఫోర్నియాలోని సాలినాస్‌లోని టాకోబెల్ అవుట్‌లెట్ వెలుపల కూర్చున్న ఇద్దరు అమ్మాయిల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎంఎస్‌_ఎంఏఎంఐఈ89 పంచుకున్నారు. ఈ ఇద్దరు రెస్టారెంట్‌ వైఫైకి కనెక్ట్‌ అయ్యి ఎంత శ్రద్ధగా వారి హోంవర్క్‌ పూర్తి చేస్తున్నారో చూడండి అంటూ రాశారు. ఈ చిత్రాన్ని అందరూ షేర్ చేయండి.. స్నేహితులు, బంధువులకు ట్యాగ్‌ చేయమని అభ్యర్థించారు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. 

ఆ ఇద్దరు బాలికలను సాలినాస్ సిటీ ఎలిమెంటరీ స్కూల్ కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వారి తల్లి ఒక వలస కార్మికురాలు కాగా, అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమాని బయటకు పంపించివేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికుడు జాకీ లోపెజ్ బాలికల కుటుంబానికి, వారి విద్యకు మద్దతుగా ‘గోఫండ్‌ మీ’ పేజీని ఏర్పాటు చేశాడు. 1,40,000 డాలర్ల నిధులను వారికి విరాళంగా అందజేశారు. చిన్నారులకు సహాయం చేసిన ప్రతిఒక్కరికీ లోపేజ్‌ ధన్యవాదాలు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo