సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 07:17:04

అక్కడ మాస్కు ధరించకుంటే సమాధి తవ్వాల్సిందే..

అక్కడ మాస్కు ధరించకుంటే సమాధి తవ్వాల్సిందే..

జకార్తా :  కరోనా నియంత్రణకు నిబంధనలు పాటించని వారికి పలు దేశాల్లో భారీగా జరిమానాలు విధిస్తుండగా కొన్నిచోట్ల మాత్రం వినూత్న శిక్షలు అమలు చేస్తున్నారు. ఇండొనేషియాలోని తూర్పు జావాలో మాస్కులు ధరించని వారితో స్థానిక అధికారులు సమాధులు తవ్విస్తున్నారు. జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన ఎనిమిది మందితో న్గాబెటన్ గ్రామంలో కరోనాతో మరణించిన వారికోసం శ్మశానవాటికలో సమాధులు తవ్వించారు.

ఇక్కడ సమాధులు తవ్వేందుకు ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఈ తరహా శిక్ష విధిస్తున్నట్లు సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో పేర్కొన్నారు. ఒక్కో సమాధికి తవ్వేందుకు ఇద్దరిని కేటాయిస్తున్నామని, ఒకరికి తవ్వే పని అప్పగించి, మరొకరు అందులో చెక్కబోర్డు పెట్టాలని సూచిస్తున్నట్లు చెప్పారు. శిక్ష అమలుతో నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య తగ్గుతుందని సుయోనో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo