శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 19:54:57

2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..

2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రపరుచుకోవడం అనే అలవాటు అందరికీ చేరింది. చేతులు కలపడం మానేసి నమస్తే పెడుతూ అవకాశం దొరికినప్పుడల్లా శానిటైజర్లతో చేతులను రుద్దుకోవడం 2020 లో సాధారణ అలవాటుగా మారింది. చిన్నారులంతా స్కూళ్లకు బైబై చెప్పేసి ఇంటి నుంచే పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. స్కూళ్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఏది ముట్టుకున్నా శానిటైజర్‌తో చేతులను రుద్దుకోవడం అలవాటైంది.

ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్నారుల పాలిట కరోనా వైరస్‌ పాశంలా తయారైందని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టి లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో టెక్సాస్‌లోని ఓ చిన్న పట్టణానికి ఓ చిన్నారి తల్లితో కలిసి రోడ్లపైకి వచ్చింది. అప్పటివరకు టీవీలు, మొబైల్‌ ఫోన్లలో చూసిన శానిటైజర్‌తో చేతులను రుద్దుకోవడం ఆ పాపపై ఎంతగా ప్రభావం చూపిందంటే.. రోడ్డుపై కనిపించిన స్ట్రీట్‌ పోల్‌, ఇటుకల గోడ,  గార్డెన్‌ లైట్‌.. ఇలా దేన్ని చూసినా శానిటైజర్‌ తీసుకునే చోటు అనుకుంటూ వెళ్లి వాటిని తాకడం.. చేతులను రుద్దుకోవడం చేసింది. ఈ వీడియోను ఆ చిన్నారి తల్లి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కరోనా వైరస్‌ చిన్నారులను ఎంతగా ప్రభావితం చేసిందో ఈ వీడియోను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ చిన్నారి వీడియోను స్థానిక టీవీలు ప్రసారం చేస్తూ శానిటైజర్‌ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo