బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 19:48:05

తండ్రికి చిన్నారి స్కేట్‌బోర్డ్‌ పాఠాలు.. వీడియో వైరల్‌

తండ్రికి చిన్నారి స్కేట్‌బోర్డ్‌ పాఠాలు.. వీడియో వైరల్‌


హైదరాబాద్‌: బొమ్మలతో ఆడుకోవాల్సిన చిన్నారి తండ్రికే స్కేట్‌బోర్డ్‌ పాఠాలు చెబుతోంది. ప్రొఫెషనల్‌ మాదిరిగా సలహాలు ఇస్తోంది. కోచ్‌లాగా అటూ ఇటూ తిరుగుతూ సూచనలు చేస్తోంది. జాగ్రత్త అంటూ కూతరిగా ప్రేమనూ చూపుతోంది. ఈ ముద్దులొలికే పాప చేష్టలకు నెటిజన్లు ముగ్గులైపోయారు. ఈ వీడియోను హీథర్ బ్రెన్నాన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

పెట్రా లెనాక్స్ తన తండ్రికి స్కేట్ బోర్డ్ సాధ్యమైనంత ఆరోగ్యకరమైన రీతిలో నేర్పిస్తోంది. పిగ్‌టెయిల్‌ కలిగి ఉన్న చిన్న అమ్మాయి తన తండ్రికి సూచనలు ఇస్తూ నడుస్తోంది. కొన్ని సమయాల్లో ఆమె సూచనలు ఇస్తున్నప్పుడు నేలపై కోచ్‌లాగా తిరుగుతోంది. తన అందమైన గొంతుతో ‘జాగ్రత్తగా నాన్న’ అంటూ ప్రేమనూ కనబరుస్తోంది. ఇన్‌స్టాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. చాలామంది వీక్షించారు. మరెందుకాలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo