శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
International - Jul 10, 2020 , 12:56:02

స్నాక్స్ దొంగ‌త‌నం చేస్తూ ప‌ట్టుబ‌డిన చిన్నారి.. నిద్ర‌పోతూ భ‌లే త‌ప్పించుకుంది!

స్నాక్స్ దొంగ‌త‌నం చేస్తూ ప‌ట్టుబ‌డిన చిన్నారి.. నిద్ర‌పోతూ భ‌లే త‌ప్పించుకుంది!

చిన్న‌పిల్ల‌ల‌కు ఏది తినొద్దు అంటే దాని మీదే మ‌న‌సంతా ఉంటుంది. ఎంతో ఇష్ట‌మైన చాక్లెట్ల్స్‌, స్నాక్స్ ఉన్న ప్ర‌దేశం తెలిస్తే చాలు ఎలా అయినా కొట్టేస్తారు. తీరా దొరికిన‌ప్పుడు ఏం తెలియ‌ని నంగ‌నాసిలా భ‌లే యాక్ట్ చేస్తారు. ఆ వ‌య‌సులో వారు ఏం చేసినా కొట్టడం కాదు క‌దా.. తిట్టాల‌ని కూడా అనిపించ‌దు. అందుకే ఈ బామ్మ కూడా చిన్నారిని ఏం అన‌లేదు. అయితే ఈ పాప ఎలా త‌ప్పించుకుందో తెలుసా?

అమెరికాలోని క‌నెక్టిక‌ట్‌లోని న్యూ హెవెన్‌కు చెందిన 20 నెల‌ల వ‌య‌సున్న అమ‌ల అమ్మ‌మ్మ అయిన  క్రిస్ జె వాఘ్న్‌ను తెలియ‌కుండా ఫ్రూట్ స్నాక్స్ దొంగ‌లించింది. ఆ క్ర‌మంలో అమ్మ‌మ్మ‌కు ప‌ట్టుబ‌డింది. ఇంత చిన్న వ‌య‌సులో ఆ చిన్నారి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డానికి నిద్ర‌పోతున్న‌ట్లు యాక్ట్ చేసింది.  "నేను ఆమె చిరుతిండిని పట్టుకున్నప్పుడు ఆమె నిద్రపోతున్నట్లుగా వ్యవహరించారా ???" అనే శీర్షికతో ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. పాపాయి నిద్ర‌పోయిన త‌ర్వాత నిదానంగా క‌ళ్లు తెరిచిన‌ప్పుడు ఒక క్యూట్ స్మైల్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. దీనిని ఇప్ప‌టివ‌ర‌కు 1.6 మిలియ‌న్ల మంది వీక్షించారు. 

   


logo