గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 09, 2020 , 17:41:16

సెరెబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న అమ్మాయి.. మొదటిసారి మెట్లెక్కింది..!

సెరెబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న అమ్మాయి.. మొదటిసారి మెట్లెక్కింది..!

న్యూయార్క్‌: సెరెబ్రల్‌పాల్సీ..అనేది చలనశీలత రుగ్మత. ఇది చాలా చిన్న వయస్సులోనే  ప్రభావితం చేస్తుంది. మెదడులోని లోపాలతో కండరాలు చాలా బలహీనంగా మారుతాయి. దీనితో బాధపడేవారు అడుగు తీసి అడుగేయలేరు. అయితే, ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్న ఓ అమ్మాయి ఎవరి సహాయం లేకుండా మెట్లెక్కేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ అమ్మాయి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. 

చిన్నప్పటినుంచి కదలలేని స్థితిలో ఉన్న ఓ అమ్మాయి. మెల్లగా నడవడం ప్రాక్టీస్‌ చేసింది. తన వైకల్యాన్ని అధిగమిస్తూ ఆమె చివరికి ఇంట్లోని మెట్లన్నీ ఎక్కేసింది. ఎవరి సహాయం లేకుండా కేవలం రేలింగ్‌ పట్టుకుని అడుగుతీసి అడుగేస్తూ ఒక్కో మెట్టు ఎక్కింది. చివరి మెట్టుకు చేరుకోగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె చిరునవ్వు ముందు సెరెబ్రల్‌ పాల్సీ చిన్నబోయింది. ఈ వీడియోను అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ మాజీ క్రీడాకారిణి రెక్స్‌ చాప్మన్‌ ట్విట్టర్‌లో పెట్టింది. 58,900 లైక్‌లు, 6000 రీట్వీట్లు వచ్చాయి. వీడియోను ఇప్పటివరకూ 7,61,100 మంది చూశారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo