బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 17:59:07

కొడుకు ఆనందంకోసం తండ్రి గోడలా మారాడు..! వీడియో వైరల్‌

కొడుకు ఆనందంకోసం తండ్రి గోడలా మారాడు..! వీడియో వైరల్‌

అమెస్టర్‌డామ్‌: పిల్లల హృదయాల్లో తండ్రులు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. పిల్లల్ని వారు కంటికిరెప్పలా కాపాడుకుంటారు. ఎలాంటి హాని జరుగకుండా వెన్నంటి ఉంటారు. పిల్లల ఆనందంకోసం వారు ఏమైనా చేస్తారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ తండ్రి తన కొడుకు సంతోషం కోసం గోడలా మారాడు. తన వీపును గోడలాగా చేసుకుని బాస్కెట్‌బాల్ నెట్‌‌ తగిలించుకున్నాడు. కొడుకు బాల్‌ వేస్తూ ఆనందపడుతూ ఉంటే అతడు సహాయపడుతూ ముందుకునడిచాడు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. 

'బ్యూటెంగెబెడెన్' అనే డచ్ ట్విట్టర్ పేజీలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బాలుడు ఏంజిల్స్ లేకర్స్ జెర్సీ నంబర్ 23 ధరించాడు, ఇది సూపర్ ఫేమస్ లెబ్రాన్ జేమ్స్ జెర్సీ. అతడి తండ్రి వీపునకు బాస్కెట్‌ బాల్‌ నెట్‌ తగిలించుకుని ముందు నడుస్తుండగా, బాలుడు వెనుక వస్తూ నెట్‌లో బాల్‌ వేస్తున్నాడు. ఆ బాల్‌ను తండ్రి పట్టుకొని మళ్లీ బాలుడికి ఇస్తున్నాడు.  ఈ వీడియోకు ‘బాల్‌ ఈజ్‌ లైఫ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీన్ని 4,73,300 మంది వీక్షించారు. 202 రీట్వీట్లు, 1100 లైక్‌లు వచ్చాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo