మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 05, 2020 , 20:04:53

మెట్రోలో జిమ్నాస్టిక్స్‌..బాలుడి వీడియో వైరల్‌!

మెట్రోలో జిమ్నాస్టిక్స్‌..బాలుడి వీడియో వైరల్‌!

లాహోర్‌: బస్సు, రైలు ఎక్కినప్పుడు పిల్లల చేష్టలు భలే ముద్దుగా ఉంటాయి. అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఓ బాలుడు పాకిస్తాన్‌లో ఇటీవల ప్రారంభమైన మెట్రోలో జిమ్నాస్టిక్‌ చేస్తుండగా తీసిన వీడియో నెటిజన్లకు ఆనందం పంచుతోంది. 

ఈ ఉల్లాసభరితమైన వీడియోను లాహోర్‌లో కొత్తగా ప్రారంభించిన మెట్రో రైలులో షూట్‌ చేశారు. పిల్లవాడి విన్యాసాలు అందరికీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను ఆ దేశ సివిల్‌ సర్వెంట్‌ దన్యాల్ గిలానీ ట్విట్టర్‌లో పెట్టారు. ‘లాహోర్ ఆరెంజ్ లైన్ మెట్రో ప్రజలకు కొత్త వినోద అవకాశాలను అందిస్తున్నది.’ అని శీర్షిక పెట్టారు. ఈ ట్వీట్‌కు 1100 రీట్వీట్లు, 3,100 లైక్స్‌ వచ్చాయి. 1,61,700 మంది ఈ వీడియోను వీక్షించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.