సోమవారం 25 మే 2020
International - Apr 07, 2020 , 18:49:42

కరోనా వైరస్‌ సోకని దేశాలు ఇవే..

కరోనా వైరస్‌ సోకని దేశాలు ఇవే..

లండన్‌:  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 205కు పైగా దేశాల్లో కరోనా వైరస్‌ ప్రవేశించింది.   చైనాలోని వుహాన్‌లో పుట్టి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి  ఇప్పుడు మానవ జాతి మనుగడకే ప్రమాదంగా మారింది. ఐతే కొన్ని దేశాల్లో మాత్రం కోవిడ్‌-19 అడుగుపెట్టనేలేదు. ప్రపంచంతో ఎక్కువగా సంబంధం లేని చిన్న చిన్న ద్వీపాలు,  విదేశీ రాకపోకలు తక్కువగా ఉండే దేశాల్లోని ప్రజలకు  వైరస్‌ సోకలేదు.  చైనాకు దగ్గరగా ఉండే ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదైనట్లు ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడికాకపోవడం గమనార్హం. 

 ఆ దేశాలు ఇవే..:

ఉత్తర కొరియా, సోల్మన్‌ ఐలాండ్స్‌, తజికిస్థాన్‌, నౌరు, యెమెన్‌, కిరిబతి, మార్షల్‌ ఐలాండ్స్‌ పలావు, మైక్రోనేషియా, సమోవ, తుర్కమెనిస్థాన్‌, తువాలు, వనాటు, కామరూస్‌, టోంగా  


logo