గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 19:28:12

తారు రోడ్డుపై కునుకు తీస్తున్న‌సింహాలు..

తారు రోడ్డుపై కునుకు తీస్తున్న‌సింహాలు..

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ స‌మ‌యంలో జంతువులు స్వేచ్ఛ‌ను ఎంజాయ్ చేస్తున్నాయి.  జ‌న సంచారం లేక‌పోవ‌డంతో.. కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి ర‌క‌ర‌కాల జంతువులు వ‌చ్చేస్తున్నాయి. ద‌క్షిణాఫ్రికాలోనూ సింహాలు ఇప్పుడు రోడ్ల‌పై స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాయి. అంతే కాదు అవి ఆ రోడ్ల‌పై హాయిగా నిద్ర పోతున్నాయి. సౌతాఫ్రికాలో క్రూగ‌ర్ నేష‌న‌ల్ పార్క్ సింహాల‌కు ఫేమ‌స్‌. ఆ పార్క్‌కు విదేశీ టూరిస్టుల‌కు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఆ దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించారు.  దీంతో ప‌ర్యాట‌కుల‌కు బ్రేక్ ప‌డింది. ఈ స‌మ‌యంలోనే క్రూగ‌ర్ పార్క్‌లో ఉన్న సంహాలు.. ఇప్పుడు స్వేచ్చ‌గా విహ‌రిస్తున్నాయి. అవి ఆ పార్క్‌లో ఉన్న తారు రోడ్డుపై కునుకు తీస్తున్నాయి. ఆ పార్క్‌లో ఉన్న ఓ రెస్టు క్యాంపు స‌మీపంలో ఇలా సింహాలు నిద్ర‌పోవ‌డాన్ని ఓ ఫోట‌గ్రాఫ‌ర్ త‌న కెమెరాలో బంధించారు.


logo