గురువారం 04 జూన్ 2020
International - Apr 18, 2020 , 15:16:30

రోడ్డుపై ద‌ర్జాగా నిద్ర‌పోతున్న సింహాలు..

రోడ్డుపై ద‌ర్జాగా నిద్ర‌పోతున్న సింహాలు..

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా ఇపుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు చాలా వ‌ర‌కు దేశాలు లాక్ డౌన్ పాటిస్తోన్న విష‌యం తెలిసిందే. లాడ్ డౌన్ ఎఫెక్ట్ తో ఆయా దేశాల్లో పార్కులు, ప‌ర్యాట‌క ప్ర‌దేశాలన్నీ మూసివేశారు. ఎప్పుడూ ప‌ర్యాట‌కుల‌ తాకిడితో కిట‌కిట‌లాడే పార్కులు..ఇపుడు ఎవ‌రూ లేక నిర్మానుష్యంగా మారాయి.

ద‌క్షిణాఫ్రికాలో ప్ర‌ఖ్యాతి గాంచిన క్రుగ‌ర్ నేష‌న‌ల్ పార్కులో సింహాల‌న్నీ ద‌ర్జాగా రోడ్డుపైకి చేరాయి. సింహాల‌న్నీ ప్ర‌శాంతంగా థార్ రోడ్డుపై ప‌డుకున్న ఫొటోలు ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.ప‌ర్యాట‌కులు ఎప్పుడూ చూడ‌ని దృశ్యం సెక్ష‌న్ రేంజ‌ర్ రిచ‌ర్డ్ సోరి చేతిలో ఉన్న‌ కెమెరా కంటికి చిక్కింది. క్రుగ‌ర్ నేష‌న‌ల్ పార్కుకు వ‌చ్చే సంద‌ర్శ‌కులు సాధారణంగా ఇలాంఇ దృశ్యం చూసి ఉండ‌రు. అని క్రుగ‌ర్ నేష‌నల్ పార్కు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo