శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 05, 2020 , 23:55:18

పాకిస్తాన్‌లోనూ దీపాల కాంతులు

పాకిస్తాన్‌లోనూ దీపాల కాంతులు

ఇస్లామాబాద్ : ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దీప ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి స‌రిగ్గా భార‌త్ మొత్తం  దీపకాంతులతో వెలిగిపోయింది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌లోనూ దీపాలు వెలిగించారు. అక్క‌డి  ఇండియన్ హైకమిషన్ కార్యాల‌యంలో కూడా అధికారులు దీప ప్రజ్వలన చేశారు. ఆఫీసు భవనంలోని లైట్లన్నీ ఆపేసి, దీపాలు వెలిగించి కరోనాపై పోరుకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ మాటతో పాకిస్తాన్‌లో కూడా దీపాలు వెలిగాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. logo