శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 22:34:26

నీలాకాశంలో మెరుపులు..! వీడియో వైరల్‌..

నీలాకాశంలో మెరుపులు..! వీడియో వైరల్‌..

న్యూయార్క్‌: ఉరుములు, మెరుపులు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎలాంటి హెచ్చరికలు లేకుండా వస్తాయి. కానీ అవి వచ్చే ముందు మనం ఆకాశాన్ని బట్టి ఊహించొచ్చు. ఆకాశంలోని మేఘాలు నల్లగా మారినప్పుడు సాధారణంగా మెరుపులు వస్తుంటాయి. కానీ, అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ అద్భుతం జరిగింది. ఆకాశం నీలంగానే ఉంది. మబ్బులుపట్టలేదు గానీ.. అకస్మాత్తుగా మెరిసింది. తాటిచెట్టుపై మెరుస్తున్న దృశ్యాన్ని జోనాథన్ మూర్ అనే వ్యక్తి తన సెల్‌లో బంధించారు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. మరెందుకాలస్యం మీరూ చూసేయండి.. logo