ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 17:18:53

'జూ'లో ప‌క్షులే కాదు ఇక‌పై పాండాలు కూడా.. ఇవి చాలా ప్ర‌త్యేకం!

'జూ'లో ప‌క్షులే కాదు ఇక‌పై పాండాలు కూడా.. ఇవి చాలా ప్ర‌త్యేకం!

ర‌క‌ర‌కాల ప‌క్షులు , జంతువుల‌ను చూడాలంటే జూకి వెళ్లాల్సిందే. అక్క‌డ రియ‌ల్ ప‌క్షులే కాకుండా శిల్పాలుగా చెక్కిన ప‌క్షులు కూడా తార‌స‌ప‌డుతాయి. ఇవి రియ‌ల్ వాటిక‌న్నా చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ప‌క్షుల జాబితాలోకి ఇప్పుడు పాండాలు కూడా వ‌చ్చి చేరాయి. లెగో ఇటుక‌ల‌తో చేసిన బేబీ పాండాల జీవిత ప‌రిమాణ ప్ర‌తిరూపాలు. ఇవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆమెరికాలోని శాన్ ఆంటోనియో జూలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈ 'జూ' ఒక క‌ళాఖండానికి ఏ మాత్రం త‌క్కువ కాదు. శాన్ ఆంటోనియో 'జూ' వ్య‌వ‌స్థాపించిన బేబీ పాండాల‌తో కూడిన చిత్రాల‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఈ శిల్పంలో ఐదు పాండాలు ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. వీటి త‌యారీకి 405 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. అంతేకాదు 53,460 ఇటుక‌లు ఉప‌యోగించిన‌ట్లు అధికారులు శీర్షిక‌లో పేర్కొన్నారు. మ‌రో 30 లెగో ఇటుక శిల్పాలను సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. పాండాలతో పాటు, జంతుప్రదర్శనశాలలో గ‌ద్ద శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి 184 గంటలు 42,198 ఇటుకలు పట్టింద‌ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.


logo