శనివారం 06 జూన్ 2020
International - Apr 19, 2020 , 12:50:12

డబ్ల్యూహెచ్‌వోకు ఆపేసిన నిధులను సద్వినియోగం చేద్దాం

డబ్ల్యూహెచ్‌వోకు ఆపేసిన నిధులను సద్వినియోగం చేద్దాం

హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఇవ్వకుండా నిలిపివేసిన 50 కోట్ల డాలర్లను అమెరికా సద్వినియోగం చేసుకోవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వోతో అన్నీ సమస్యలేనని ఆయన మండిపడ్డారు. ఆపేసిన 50 కోట్ల డాలర్ల సొమ్మును మరింత బాగా వినియోగించుకోవచ్చని అన్నారు. డబ్ల్యూహెచ్‌వో సకాలంలో అమెరికాను హెచ్చరిస్తే రాకపోకలు నిలిపివేసే వాళ్లమని ట్రంప్ అన్నారు. సకాలంలో స్పందించకుండా ఆలస్యం చేసి అమెరికాను సంక్షోభంలోకి నెట్టారని తన ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే ట్రంప్ డబ్ల్యూహెచ్‌వోపై, చైనాపై ఆరోపణలు గుప్పిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో చైనా వైపు మొగ్గు చూపుతున్నదని, చైనాకు పెంపుడు చిలకలా మారిందని కూడా ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు నేరుగా చైనానే బెదరిస్తుండడం గమనార్హం.


logo