శనివారం 04 జూలై 2020
International - Jun 26, 2020 , 19:02:43

స్విమ్మింగ్ చేస్తుండ‌గా.. మ‌ర్మాంగంలోకి జ‌ల‌గ‌

స్విమ్మింగ్ చేస్తుండ‌గా.. మ‌ర్మాంగంలోకి జ‌ల‌గ‌

ఓ యువ‌కుడు స‌ర‌దాగా చెరువులోకి దిగాడు. ఈత కొడుతూ ఎంజాయ్ చేశాడు. అల‌స‌ట నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో.. చెరువులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంటికెళ్లాడు. కాసేపు నిద్ర పోదామ‌ని ఉప‌క్ర‌మించాడు. కానీ అత‌ను నిద్ర పోలేదు. అత‌ని మ‌ర్మాంగంలో తీవ్ర‌మైన నొప్పి వ‌స్తోంది. మూత్రం వ‌చ్చిన‌ట్లు అనిపిస్తే.. బాత్రూంకు వెళ్లాడు. మూత్రం రావ‌డం లేదు. అంగం వాచిపోతుంది. చేసేదీమీ లేక ఆ యువ‌కుడు.. ఆస్ప‌త్రికి వెళ్లాడు. అక్క‌డ వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. అత‌ని మూత్రాశ‌యంలో జ‌ల‌గ క‌నిపించింది. ఈ ఘ‌ట‌న కాంబోడియాలో జూన్ 22న చోటు చేసుకుంది. 

మొత్తానికి వైద్యులు అత‌నికి శ‌స్ర్త చికిత్స చేశారు. మూత్రాశ‌యం నుంచి అంగం ద్వారా జ‌ల‌గ‌ను బ‌య‌ట‌కు తీయడం క‌ష్టంగా మారింది. బైపోలార్ రెసెక్టోస్కోప్ ను పంపి జ‌ల‌గ‌ను చంపేశారు. ఆ త‌ర్వాత జ‌ల‌గ‌ను బ‌య‌ట‌కు తీశారు. అంగం నుంచి మూత్రాశ‌యంలోకి వెళ్లిన జ‌ల‌గ‌.. సుమారు 500 మిల్లిమీట‌ర్ల ర‌క్తాన్ని తాగిన‌ట్లు వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం బాధిత యువ‌కుడు ఆరోగ్య‌క‌రంగా ఉన్నాడు. logo