బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 17:27:14

బాధ్యులు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు: ‌లెబ‌నాన్ ప్ర‌ధాని

బాధ్యులు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు: ‌లెబ‌నాన్ ప్ర‌ధాని

న్యూఢిల్లీ: లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌‌లో మంగ‌ళ‌వారం రాత్రి సంభ‌వించిన భారీ పేలుళ్ల కార‌ణంగా భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా హృద‌యవిదార‌క దృశ్యాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌మాదంలో భారీ భ‌వ‌నాలే నేల‌మ‌ట్టం అయ్యాయి. ప‌లు ఇండ్ల‌లో బాల్క‌నీలు, కిటికీలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా శ్మశాన నిశబ్దమే రాజ్యమేలుతున్న‌ది. విధ్వంసానికి సంబంధించి పొగ ఇంకా వెలువడుతూనే ఉంది. పోర్ట్‌ ఏరియా పూర్తిగా ధ్వంసమయ్యింది. 

రోడ్లన్ని గాజు పెంకులు, ఇనుప చువ్వలతో నిండి పోయాయి. అపార్ట్‌మెంట్లలోని ప్లాట్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా, బీరూట్‌ ప్ర‌మాదంలో 100 మందికిపైగా మృతిచెందార‌ని, నాలుగు వేల మందికిపైగా గాయ‌ప‌డ్డార‌ని లెబనాన్ ప్ర‌ధాని హ‌స‌న్ డియాబ్ తెలిపారు. పేలుడు తర్వాత గాల్లోకి ప్రమాదకర పదార్థాలు విడుదలయ్యాయని చెప్పారు. ఈ ప‌దార్థాలు ప్ర‌జ‌ల ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌న్న లెబ‌నాన్ ప్ర‌ధాని.. బాధ్యులు తగిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo