శుక్రవారం 05 జూన్ 2020
International - May 18, 2020 , 13:44:29

హాంగ్‌కాంగ్ పార్ల‌మెంట్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల ఘ‌ర్ష‌ణ‌..

హాంగ్‌కాంగ్ పార్ల‌మెంట్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల ఘ‌ర్ష‌ణ‌..


హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. వివాదాస్ప‌దంగా మారిన చైనా జాతీయ గీతం బిల్లును ప్ర‌జాస్వామ్య అనుకూల ఎంపీలు వ్య‌తిరేకించారు. కొత్త బిల్లు ప్రకారం చైనా జాతీయ గీతాన్ని అవ‌మానించిన వారికి శిక్ష విధించ‌నున్నారు.  అయితే ఆ బిల్లు కోసం ఏర్పాటు చేసిన క‌మిటీపై ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి.  బిల్లును వ్య‌తిరేకించిన ప్ర‌జాప్ర‌తినిధి ఎడ్డీ చూను పార్ల‌మెంట్ నుంచి బ‌య‌ట‌కు లాక్కెళ్లారు.  పార్ల‌మెంట్ చాంబ‌ర్‌లో, బ‌య‌టా ఇలాంటి ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హాంగ్‌కాంగ్ ప్ర‌త్యేక దేశ‌మే అయినా.. దానిపై చైనా గుత్తాధిప‌త్యం ఉన్న‌ది.  దీంతో ఎన్నో ఏళ్ల నుంచి హాంగ్‌కాంగ్‌లో చైనా వ్య‌తిరేక ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే తాజా బిల్లుతో మ‌రోసారి హాంగ్‌కాంగ్‌లో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.   logo