బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 05, 2020 , 07:33:10

మ‌రింత ఆల‌స్యం కానున్న అమెరికా ఫ‌లితాలు

మ‌రింత ఆల‌స్యం కానున్న అమెరికా ఫ‌లితాలు

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రింత ఆల‌స్యం కానున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ఇప్ప‌టికే ముగిశాయి. అయితే ఒక‌టి రెండు రాష్ట్రాల్లో ఓట్ల‌ ప్ర‌క్రియ‌ ఇంకా కొన‌సాగుతుండ‌గా, మ‌రో రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. దీంతో ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి మ‌రికొంత స‌మయం ప‌ట్ట‌నుంది. నార్త్ క‌రోలీనా (15) రాష్ట్రంలో ఈనెల 12 వ‌ర‌కు మెయిల్ బ్యాలెట్ల స్వీక‌రించ‌నున్నారు. దీంతో అక్క‌డ ఫ‌లితాలు ఈనెల 12 త‌ర్వాతే రానున్నాయి. అల‌స్కా (3)లో మ‌రో వారంపాటు కౌటింగ్ కొన‌సాగ‌నుంది. పెన్సిల్వేనియా (20), జార్జియా (16)లో ఇవాళ సాయంత్రానికి ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌స్తుత అధ్యక్షుడు ట్రంప్‌ నార్త్ క‌రోలినాలో ప్ర‌స్తుతం 7 వేల‌కుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా జార్జియాలో ల‌క్ష‌కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.