లండన్, మే 20: అంటార్కిటికా ఖండంలోని రొన్నే మంచు పర్వతాలలో అతి పెద్ద మంచుకొండ విరిగి సముద్రంలో పడిపోయిందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. ఎ-76గా పిలుస్తున్న ఈ మంచుకొండ విస్తీర్ణం.. 170 కిలోమీటర్ల పొడవు, 25 కిలోమీటర్ల వెడల్పు. ఇది ఢిల్లీ కంటే మూడు రెట్లు పెద్దది. వాతావరణ కాలుష్యం కారణంగా హిమానీ నదులు వేడెక్కడంతో మంచుఫలకలు, మంచుకొండలు కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.