శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 13, 2020 , 03:47:16

‘సంపన్నుల ముక్కు పిండుతాం’

‘సంపన్నుల ముక్కు పిండుతాం’

వాషింగ్టన్‌: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహ్యారిస్‌ దేశంలోని దిగువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. 4లక్షల డాలర్లలోపు వార్షిక ఆదాయం ఉన్నవారిపై కొత్తగా పన్నుల భారం మోపబోమని హామీ ఇచ్చారు. అదే సమయంలో ధనికులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం తన భర్త డగ్లస్‌ ఎమ్‌హాఫ్‌తో కలిసి వెళ్తూ నగరంలో ఓ వృద్ధుడు నడిపిస్తున్న చిన్న బేకరీషాపు వద్ద ఆమె కొద్దిసేపు ఆగారు. అనంతరం కాబోయే దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వ పన్నుల విధానం గురించి పలు ట్వీట్లు చేశారు. స్వయం ఉపాధి కల్పించే చిన్నచిన్న షాపులే అమెరికాను స్వయం సమృద్ధం చేస్తాయని అన్నారు.