శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 21:50:18

లెబ‌నాన్‌లో భారీ పేలుడు!.. వీడియో

లెబ‌నాన్‌లో భారీ పేలుడు!.. వీడియో

న్యూఢిల్లీ: లెబ‌నాన్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక్క‌సారిగా భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. ఆ ప్రాంతం అంత‌టా ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌లు అలుముకున్నాయి. పేలుడు ధాటికి ప‌రిస‌రాల్లోని ప‌లు ఇండ్ల కిటికీలు విరిగి ఎగిరిపోయాయి. కొన్ని ఇండ్ల‌లో పాలీసీలింగ్‌లు సైతం ఊడి కింద‌ప‌డ్డాయి. ఫ్యాక్ట‌రీలో భారీగా క్రాక‌ర్స్ నిలువ‌చేయ‌డంవ‌ల్లే పేలుడు సంభ‌వించింద‌ని అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం ఎంత‌, ఎంత మంది గాయ‌ప‌డ్డారు అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా, భ‌యంక‌ర‌మైన ఆ పేలుడుకు స‌బంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo