ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 13:24:11

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఆరుగురు దుర్మ‌ర‌ణం

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఖాట్మండు: నేపాల్‌లో ఘోరం జ‌రిగింది. సింధూపాల్‌చౌక్‌ జిల్లాలో గతరాత్రి కొండ చరియలు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గల్లంతయ్యారు. బర్హాబిసి గ్రామీణ మున్సిపాలిటీ-7లోని భిర్ఖార్కా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. రాత్రంతా ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షం ప‌డ‌టంతో కొండ‌ప్రాంతం బాగా నానిపోయి దిగువ‌న ఉన్న ఇండ్ల‌పై కొండ‌చ‌రియ‌లు ప‌డ్డాయి. 

స‌మాచారం అందిన వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న‌ ర‌క్ష‌ణ బృందాలు స్థానికుల‌తో క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. శిథిలాల‌ను తొల‌గించి ఆరు మృత‌దేహాలను వెలికి తీశాయి. మ‌రో 26 మంది గ‌ల్లంత‌య్యార‌ని, వారంతా శిథిలాల కింద చిక్కుకుని ఉంటార‌ని అధికారులు తెలిపారు. మొత్తం తొమ్మిది ఇండ్ల‌ను కొండ‌చ‌రియ‌లు క‌ప్పేశాయ‌ని చెప్పారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉందన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo