సోమవారం 23 నవంబర్ 2020
International - Oct 19, 2020 , 06:35:05

కొండచరియ విరిగిపడి 22 మంది సైనికులు మృతి!

కొండచరియ విరిగిపడి 22 మంది సైనికులు మృతి!

హనొయ్‌: వియత్నాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి పలువురు మరణిస్తున్నారు. ఇటీవల ఓ కొండ చరియ విరిగిపడటంతో 13 మంది మరణించగా.. తాజాగా ఆదివారం మరో కొండచరియ కుప్పకూలడంతో 22 మంది సైనికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఖ్వాంగ్‌ త్రి రాష్ట్రంలో ఓ భారీ కొండచరియ పాదాల వద్ద సైనిక శిబిరం ఉన్నది. అయితే అది ఒక్కసారిగా కుప్పకూలి శిబిరంపై పడింది. అప్రమత్తమైన కొందరు సైనికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 22 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.