గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 14:59:33

హెలిక్యాప్ట‌ర్‌లో ప్ర‌స‌వించిన క‌రోనా బాధితురాలు

హెలిక్యాప్ట‌ర్‌లో ప్ర‌స‌వించిన క‌రోనా బాధితురాలు

లాంపెడూసా: ఇట‌లీలోని లాంపెడూసా దీవి నుంచి కరోనా సోకిన ఒక మహిళను హెలిక్యాప్ట‌ర్‌లో ఆస్ప‌త్రికి తరలిస్తుండగా మార్గ‌మ‌ధ్య‌లోనే ప్ర‌స‌వించింది. హెలిక్యాప్ట‌ర్‌లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే స‌ద‌రు మ‌హిళ ఇటలీ పౌరురాలు కాదు. ఆఫ్రికా దేశాల నుంచి ఇట‌లీకి వ‌ల‌స వ‌చ్చిన మ‌హిళ‌ల్లో ఆమె కూడా ఒక‌రు. ఆఫ్రికా నుంచి వ‌చ్చి ఇటలీలోని లాంపెడూసా ద్వీపంలోని ఓ వలస శిబిరంలో ఆమె ఉంటున్న‌ది. 

అయితే, స‌ద‌రు మ‌హిళ ఇటీవ‌ల‌ క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డింది. పైగా ఆమె గ‌ర్భ‌వ‌తి కూడా కావ‌డంతో చికిత్స నిమిత్తం లాంపెడూసా ఐలాండ్ నుంచి పాలెర్మోకు త‌ర‌లిస్తుండ‌గా హెలిక్యాప్ట‌ర్‌లోనే ప్ర‌స‌వించింది. కాగా, ఆఫ్రికా దేశాల నుంచి సముద్రమార్గంలో వస్తున్న‌ వలసదారులకు ఆశ్రయం ఇవ్వాలని ఐరాస సూచించడంతో ఇటలీ ప్ర‌వాసుల‌కు అనుమతి ఇస్తున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo