సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 11:58:51

ఆయ‌న ల‌క్ష్యం.. అంద‌రికీ ఉప‌యోగ‌క‌రం

ఆయ‌న ల‌క్ష్యం.. అంద‌రికీ ఉప‌యోగ‌క‌రం

చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌తిఒక్క‌రూ క‌ల‌లుకంటూ పెరుగుతారు. వాటిని సాకారం చేసుకున్న‌వారే నిజ‌మైన పౌరులు. అలా ల‌ఢ‌క్‌కు చెందిన లామా తుప్స్తాన్ చోగ్యాల్‌ బాల్యం నుంచి క‌న్నక‌ల‌ను నెర‌వేర్చ‌కునేందుకు ఆయుర్వేదంపై ప‌ట్టుసారించాడు. వైద్యం నేర్చుకున్న తర్వాత మెడిక‌ల్ కాంపెయిన్ల‌లో పాల్గొనేవాడు. పేద‌వారికి ఉచితంగా వైద్యం అందించ‌డ‌మే అత‌ని ధ్యేయం అని తెలుసుకున్న ఓ పెద్దాయ‌న హాస్పిట‌ల్ నిర్మించ‌మ‌ని స‌లహా ఇచ్చాడు. ఆ త‌ర్వాత దానివైపు అడుగులు వేశాడు. 2002 లో హాస్పిట‌ల్ నిర్మాణం మొదులలుపెట్టి అన్ని సౌఖ‌ర్యాల‌తో 2007కి పూర్తి చేశాడు. దాని పేరు ల‌ఢ‌క్ హార్ట్ డోనేష‌న్ హాస్పిట‌ల్. ఈ క్ర‌మంలో 2004లో ఢిల్లీలో మెడిక‌ల్ కాంపెయిన్లు నిర్వ‌హించాడు. అది కూడా ఆర్మీ వారి కోస‌మే. ఇప్ప‌టివ‌ర‌కు ఈ హాస్పిట‌ల్‌లో 300 హార్ట్ స‌ర్జ‌రీలు చేశాడు. అంతేకాకుండా ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు, క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు. ప్ర‌తినెలా 500 నుంచి 700 పేషంట్ల‌కు ఉచితంగా ట్రీట్‌మెంట్ అందిస్తారు.


న‌లుగురు డాక్ట‌ర్లు, కొంత‌మంది న‌ర్సులు ఇందులో ప‌నిచేస్తారు. ఇంత‌కుముందు ఇత‌ర దేశాలు, రాష్ట్రాల‌కు కూడా వైద్యం అందించేవారు. ప్ర‌స్తుతం ఇప్ప‌డు కోవిడ్‌-19 అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతుండ‌డంతో వీరి వైద్యానికి బ్రేక్‌నిచ్చారు. ఎందుకంటే క‌రోనా ఉన్న‌వారికి ట్రీట్‌మెంట్ చేసిన త‌ర్వాత ఇత‌రుల‌కు చేయ‌డంతో అది వారికి కూడా వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని వీరు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు అందించిన వైద్యానికి గాను ఈ హాస్పిట‌ల్‌కు ప‌ద్మ‌భూష‌న్ అవార్డు వ‌చ్చింది. ఈ హాస్పిట‌ల్‌కు పేద‌వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు మ‌రో పెద్ద అవ‌కాశం వ‌చ్చింది. క‌రోనా బాధితులు పెర‌గ‌డంతో ద‌వాఖానాలు లేక విల‌విల‌లాడుతున్నారు. వారికి ఈ హాస్పిట‌ల్ ఆశ్ర‌మం ఇస్తున్న‌ది. క‌రోనా ట్రీట్‌మెంట్‌కు కావాల్సిన అన్ని స‌దుపాయాలు స‌మ‌కూర్చారు. ఎయిర్‌పోర్ట్స్ నుంచి త‌ర‌లించిన వారికి కూడా వీరు వైద్యం అందిస్తున్నారు. వీరి కోసం పోరాడుతున్న ఎంతోమంది డాక్ట‌ర్లు, డ్రైవ‌ర్లు, పోలీసులంద‌రికీ లామా అభినంద‌న‌లు తెలుపుతున్నారు.


logo