సోమవారం 18 జనవరి 2021
International - Jan 09, 2021 , 01:17:35

లఖ్వీకి 15 ఏండ్ల జైలు

లఖ్వీకి 15 ఏండ్ల జైలు

లాహోర్‌: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జకీ-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీకి లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న ఆరోపణలపై పాక్‌లోని కౌంటర్‌ టెర్రరిజం విభాగం (సీటీడీ) లఖ్వీని గత శనివారం ఆరెస్టు చేసింది.  అంతర్జాతీయ సదస్సులు, ఎఫ్‌ఏటీఎఫ్‌ భేటీకి ముందు ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్నట్టు నటించడం పాక్‌కు అలవాటేనని భారత్‌ విమర్శించింది.