ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 21, 2021 , 22:02:25

క‌పోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం

క‌పోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో హాలీవుడ్ న‌టి లేడీ గగా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. కార్పొరేట్లు, సినీ ప్ర‌ముఖుల త‌ళుకుబెలుకుల మ‌ధ్య ఆడంబ‌రంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఆమె జాతీయ గీతాన్ని ఆలాపించారు. అంతేకాదు.. ప్ర‌పంచ శాంతిని కాంక్షిస్తూ త‌న ఎర్ర‌టి స్క‌ర్ట్‌పై తెల్ల‌ని శాంతి క‌పోతం చిహ్నాన్ని ధ‌రించ‌డం ద్వారా శ‌క్తిమంత‌మైన భావోద్వేగ‌పూరిత సందేశాన్నిచ్చారు.

అటు పిమ్మ‌ట ట్విట్ట‌ర్ వేదిక‌గా శాంతి క‌పోతం చిహ్నాన్ని తాను ధ‌రించ‌డానికి కార‌ణాలు వివ‌రించారు. అంద‌రికి శాంతి క‌లుగాల‌ని కోరుతూ తాను ఆ చిహ్నం ధ‌రించిన‌ట్లు చెప్పారు. అమెరిక‌న్ల కోసం జాతీయ గేయాన్ని ఆలాపించ‌డం త‌న‌కు గౌర‌వం అని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌లంతా ఆప్యాయ‌త, ప్రేమానురాగాల‌తో జీవ‌నం సాగించాల‌న్న‌దే త‌న ఉద్దేశం అని ట్వీట్ చేశారు.  లేడీ గాగాతోపాటు సినీ న‌టి జెన్నీఫ‌ర్ లోపేజ్‌, గాయ‌కుడు గార్త్ బ్రూక్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo