మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 06, 2020 , 15:18:26

ఎన్నిక‌ల ఫ‌లితాలు ర‌ద్దు.. కిర్గిస్థాన్‌లో తీవ్ర ఆందోళ‌న‌లు

ఎన్నిక‌ల ఫ‌లితాలు ర‌ద్దు.. కిర్గిస్థాన్‌లో తీవ్ర ఆందోళ‌న‌లు

హైద‌రాబాద్‌: కిర్గిస్థాన్‌లో ఆదివారం పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇవాళ ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.  ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆందోళ‌న‌కారులు ఆ దేశ పార్ల‌మెంట్ భ‌వ‌నంపై దాడికి ప్ర‌య‌త్నించారు.  కొత్త‌గా మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌కారులు పోలీసుల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ ఆందోళ‌న‌ల్లో వేలాది మంది గాయ‌ప‌డిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  త‌న‌ను అక్ర‌మంగా తొల‌గించేందుకు కొన్ని రాజ‌కీయ శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌ని అధ్య‌క్షుడు సూరోన్‌బాయ్ జీన్‌బికోవ్ ఆరోపించారు. ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడు జీన్‌బికోవ్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన కొన్ని పార్టీల‌కు మాత్ర‌మే పార్ల‌మెంట్‌లోకి ఎంట్రీ క‌ల్పించార‌ని నిర‌స‌న‌కారులు ఆరోపిస్తున్నారు. logo