శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 10:55:00

ఇండియా ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి లేదు : కువైట్‌

ఇండియా ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి లేదు : కువైట్‌

కువైట్ : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఆయా దేశాలు అంత‌ర్జాతీయ విమాన రాక‌పోక‌ల‌పై నిషేధం విధించిన విష‌యం విదిత‌మే. కువైట్ దేశం ఆగ‌స్టు 1వ తేదీ నుంచి అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌ను అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కువైట్ పౌరుల‌కు, నివాసితుల‌కు బ‌య‌ట‌కు వెళ్లేందుకు, వ‌చ్చేందుకు అనుమ‌తిచ్చింది. కువైట్‌లోకి భార‌తీయుల‌ను అనుమ‌తించ‌మ‌ని అక్క‌డి అధికారులు స్ప‌ష్టం చేశారు. భార‌తీయుల‌తో పాటు బంగ్లాదేశ్, ఫిలిఫిన్స్, శ్రీలంక‌, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ దేశాల నుంచి వ‌చ్చే వారికి కూడా అనుమ‌తి లేద‌ని పేర్కొంది. 


logo