ఆరస్: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్ వేసిన కార్టూనిస్టు కర్ట్ వెస్టర్‌గార్డ్ కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. సుదీర్ఘకాలం నుంచి అనారోగ్యంగా ఉన్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవక్తపై వేసిన కార్టూన్‌తో వెస్టర్గాడ్పై ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. జిలాండ్స్ పోస్టన్ పత్రికలో ఆయన 1980 దశకంలో కార్డూనిస్టుగా పనిచేశారు. 2005లో ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్ వేయడంతో ఆయన వరల్డ్ ఫేమస్ అయ్యారు. ఆ కార్టూన్‌కు వ్యతిరేకంగా డెన్మార్క్‌లో భారీ నిరసనలు చేపట్టారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాల నుంచి డెన్మార్క్‌పై అప్పట్లో వత్తిళ్లు వచ్చాయి. 2006లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెన్మార్క్ ఎంబసీలపై ముస్లింలు దాడి చేశారు. 2015లో ఓ ఫ్రెంచ్ మ్యాగ్జిన్ చార్లీ హెబ్డో కూడా కార్టూన్ వేయడంతో ఆ పత్రిక ఆఫీసుపై దాడి జరిగింది. ఆ దాడిలో 12 మంది మరణించారు. ప్రవక్తపై కార్టూన్లు వేసిన తర్వాత వెస్ట్గార్డ్కు అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి.