గురువారం 09 ఏప్రిల్ 2020
International - Jan 20, 2020 , 12:43:22

ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్‌..

ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్‌..

దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు డబ్ల్యూఈఎఫ్‌-50వ వార్షిక సదస్సు జరగనుంది. వివిధ దేశాల నుంచి ఆర్థిక వేత్తలు, రాజకీయవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. సంస్థ ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ దావోస్‌కు వెళ్లారు. ఈ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంలో ‘టెక్నాలజీ ప్రయోజనాలు-ఎదురయ్యే సవాళ్ల’పై చర్చ జరగనుంది.


ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రగతిని వివరించేలా ప్రసంగించనున్నారు. సదస్సు అనంతరం ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. వారికి రాష్ట్రంలోని అవకాశాలు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఇందుకు గానూ ప్రత్యేక పెవిలియన్‌ ఏర్పాటుకు నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు. కృత్రిమ మేధా, ఎలక్ట్రానిక్‌ సహా పలు రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీల సీఈఓలను మంత్రి ఆహ్వానించనున్నారు. టీఎస్‌ ఐపాస్‌, భూబ్యాంకు, ఇతర అంశాలను వారికి వివరిస్తారు.


logo