ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 12:11:21

చిప్స్ ప్యాకెట్‌ను ట‌చ్ చేసింద‌ని య‌జ‌మానిని కొట్టిన‌ పిల్లి : వీడియో వైర‌ల్‌

చిప్స్ ప్యాకెట్‌ను ట‌చ్ చేసింద‌ని య‌జ‌మానిని కొట్టిన‌ పిల్లి :  వీడియో వైర‌ల్‌

ఇంట్లో పిల్లి గాని ఉంటే దాని హ‌డావుడే వేరు. ఒక‌చోట కూడా కుదురుగా కూర్చోదు. అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. య‌జ‌మానుల మీద ప్రేమ ఎక్కువైతే చ‌నువుగా ఉంటూ త‌మ‌ ఇష్టాన్ని బ‌య‌ట పెడుతాయి. ఎక్క‌డికి వెళ్లినా య‌జ‌మానులు వాటిని వెంట తీసుకెళ్ల‌డం, కావాల్సిన‌వి అందిస్తుండ‌టంతో పెట్స్‌కు య‌జ‌మానుల‌కు మ‌ధ్య మంచి బంధం ఏర్ప‌డుతుంది. అందుకే య‌జ‌మానుల కోసం ఏమైనా చేస్తాయి పెట్స్‌. ఈ పెట్ పిల్లి మాత్రం త‌ను దాచుకున్న చిప్స్ ప్యాకెట్ య‌జ‌మాని తాకితే అస‌లు ఊరుకోవ‌ట్లేదు. కోప‌మొచ్చి ఆమెను కొట్టింది. 

పిల్లి పేరు కెన్నీ. ఒక చిప్స్ ప్యాకెట్‌ను గ‌ట్టిగా కౌగిలించుకొని బెడ్ మీద ప‌డుకుంది. య‌జ‌మాని చిప్స్ ప్యాకెట్ ముట్టుకోగానే కాళ్ల‌తో వారి చేతి మీద కొట్టింది పిల్లి. ఈ వీడియోను య‌జ‌మాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. దీనిని 1.8 ల‌క్ష‌ల‌కు పైగా వీక్షించారు. 'కెన్నీ నువ్వు చిప్స్ తిన‌లేవు, మియోమీతో త‌ప్ప‌కుండా షేర్ చేసుకోవాలి' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. logo