మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 15:25:23

పాపం పిల్లి వాటర్‌ బబుల్‌లో ఇరుక్కుపోయింది.. ఫైర్‌సిబ్బంది బయటకు తీశారు!

పాపం పిల్లి వాటర్‌ బబుల్‌లో ఇరుక్కుపోయింది.. ఫైర్‌సిబ్బంది బయటకు తీశారు!

జకార్తా: జంతువులు తరుచుగా ఊహించని ప్రదేశాల్లో చిక్కుకుంటాయి. దానినుంచి బయటపడలేవు. గిలగిలాకొట్టుకొని ప్రాణాలుకూడా విడుస్తుంటాయి. ఇలాగే, ఓ పిల్లి అటూ ఇటూ తిరుగుతూ వాటర్‌ బబూల్‌లో ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ,తన వల్ల కాలేదు. దీంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాన్ని కాపాడారు.

ఈ సంఘటన  ఇండోనేషియా దేశంలోని జకార్తాలో జరిగింది. వాటర్‌బబూల్‌లో పిల్లి శరీరం మొత్తం ఇరుక్కుపోగా తలమాత్రం బయటే ఉంది. దీనంగా అరుస్తున్న పిల్లిని చూసిన కొందరు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి దాన్ని తీసుకెళ్లారు. అగ్నిమాపక కేంద్రంలో వాటర్‌బబూల్‌ను జాగ్రత్తగా కట్‌చేసి ఆ మార్జాలాన్ని రక్షించారు. దాన్నిసురక్షితంగా బయటకు తీసేందుకు దాపు 30 నిమిషాలు శ్రమించారు. పిల్లి ఆరోగ్యంగానే ఉండగా, అది ఒంటరిదని తేల్చారు. దీంతో స్థానికులు దాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకువచ్చారు. వారికి అగ్నిమాపక సిబ్బంది పిల్లిని అప్పగించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo