ఆదివారం 31 మే 2020
International - May 09, 2020 , 09:59:38

ర‌ష్యా అధ్య‌క్షునికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ కిమ్ జోంగ్ ఉన్ లేఖ

ర‌ష్యా అధ్య‌క్షునికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ కిమ్ జోంగ్ ఉన్ లేఖ

సియోల్‌: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్‌కు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో మిత్ర‌రాజ్యాల విజ‌యానికి 75వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ లేఖ రాశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై ర‌ష్యా విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. కోవిడ్ -19పై విజ‌యం సాధించి శ‌క్తివంత‌మైన ర‌ష్యాను నిర్మించ‌డానికి అక్క‌డి ప్ర‌జ‌లు చేస్తున్న పోరాటంలో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. 

  చైనా తాను కోవిడ్‌-19ను అదుపులోకి తీసుకురావ‌డంలో సాధించిన విజ‌యాల‌ను ప్ర‌శంసిస్తూ చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు ఎస్ఎమ్ఎస్ ద్వారా సందేశాన్ని పంపిన‌ట్లు అధికారిక కొరియా సెంట్ర‌ల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వైర‌స్ బారిన ప‌డ‌కుండా నెల‌ల త‌ర‌బ‌డి దేశ స‌రిహ‌ద్దును మూసివేసిన త‌రువాత చైనా, ఉత్త‌ర కొరియా దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఆర్థికంగా లాభం చేకూరుతాయ‌ని నిపుణులు తెలిపారు. 


logo