శనివారం 06 జూన్ 2020
International - Apr 02, 2020 , 22:43:54

కిమ్ ఇలాకాలో కరోనా లేదా..?

కిమ్ ఇలాకాలో కరోనా లేదా..?

చైనా వుహ‌న్‌లో పురుడుపోసుకున్న క‌రోనా ప్రపంచ‌దేశాల‌పై ఉగ్ర‌రూపం చూపిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య 10ల‌క్ష‌ల‌కు చేరుకోగా..మ‌ర‌ణాలు 50వేల‌కు చేరువ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే చైనాకు స‌రిహ‌ద్దు దేశం నార్త్‌కొరియా ఇందుకు విరుద్ద‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. అస‌లు అన్ని దేశాల‌ను క‌రోనా అత‌లాకుతలం చేస్తుంటే... ఇప్పటివరకు తమ దేశంలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటీ నమోదు కాలేదని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. అధికారులు చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే చైనాలో ఈ మహమ్మారి ప్రభావం పెరుగుతున్న సమయంలోనే తమ దేశ సరిహద్దులను జనవరిలోనే మూసివేశామని పేర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి దేశంలో రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని  పేర్కొంటున్నారు. అయితే వైద్య రంగంలో బలహీనంగా ఉన్న నార్త్ కొరియాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేద‌న‌డం  పలువురు నిపుణులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.logo