గురువారం 28 మే 2020
International - May 02, 2020 , 02:25:06

కిమ్‌.. వారం కిందటే చనిపోయారు!

కిమ్‌.. వారం కిందటే చనిపోయారు!

  • ఉత్తర కొరియాకు చెందిన జి సియాంగ్‌ వెల్లడి 

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వారం కిందటే చనిపోయారని ఆ దేశానికి చెందిన జి సియాంగ్‌ హో తెలిపారు. దక్షిణ కొరియాకు వలస వచ్చిన ఆయన, గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. శుక్రవారం స్థానిక యోన్‌హాప్‌ వార్త సంస్థతో జి సియాంగ్‌ మాట్లాడుతూ.. తనకు అందిన సమాచారం ప్రకారం శస్త్రచికిత్స తర్వాత కిమ్‌ మరణించినట్లు 99 శాతం కచ్చితంగా చెప్పగలనన్నారు. వారసుల ఎంపిక స్పష్టత వచ్చాక కిమ్‌ మరణాన్ని అధికారంగా ప్రకటించవచ్చన్నారు. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉన్న కిమ్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 


logo