ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ చాలా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీంతో ముందు, తర్వాత అంటూ ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆయన బరువు తగ్గడంపై చాలా మంది నార్త్ కొరియన్లు ఆందోళన చెందుతున్నారు.
తమ నేత ఇలా కనిపిస్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు. కేవలం 4 నెలల సమయంలోనే కిమ్ ఇలా మారిపోయినట్లు ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలో రాయ్‌టర్స్ చెప్పింది. అయితే కిమ్ నిజంగానే డైట్లో ఉన్నారా లేక బరువు తగ్గడానికి మరేదైనా కారణంగా ఉందా అన్నది తెలియలేదు.