బుధవారం 27 మే 2020
International - Apr 21, 2020 , 11:52:13

కిమ్ బ్రెయిన్‌డెడ్‌.. కాద‌న్న‌ ద‌క్షిణ కొరియా

కిమ్ బ్రెయిన్‌డెడ్‌.. కాద‌న్న‌ ద‌క్షిణ కొరియా

హైద‌రాబాద్‌: ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వస్తున్న వార్త‌ల‌ను ద‌క్షిణ కొరియా కొట్టిపారేసింది.  గుండెకు స‌ర్జ‌రీ చేసుకున్న త‌ర్వాత కిమ్ ఆరోగ్యం క్షీణించిన‌ట్లు వార్తలు వ్యాపించాయి. బ్రెయిన్ డెడ్ అయ్యార‌ని, ఆప‌రేష‌న్ నుంచి కోలుకుంటున్నార‌ని, అత్యంత దారుణంగా ఆయ‌న ప‌రిస్థితి ఉంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ద‌క్షిణ కొరియా అధికారులు వెల్ల‌డించారు. కిమ్ ఆరోగ్యం వ‌స్తున్న వ‌దంతుల‌ను ద్రువీక‌రించ‌లేమ‌ని చెప్పారు. 36 ఏళ్ల కిమ్ ఆరోగ్యం క్షీణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నా, ఉత్త‌ర కొరియా నుంచి మాత్రం దీనిపై ఎటువంటి క్లారిటీ రావ‌డం లేద‌ని సియోల్‌లోని అధ్య‌క్ష భ‌వ‌నం పేర్కొన్న‌ది. కిమ్ జాంగ్ ఆరోగ్యంపై గ‌తంలో ఇలాంటి వ‌దంతులు వ్యాపించాయి.  

ఏప్రిల్ 15వ తేదీన కిమ్ తాత పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. ఆ జ‌యంతి వేడుక‌ల‌కు కిమ్ జాంగ్ మిస్స‌య్యారు. దీంతో ఆయ‌న‌పై అనుమానాలు వ్య‌క్తం కావ‌డం మొద‌ల‌య్యాయి. కిమ్ తాత‌య్యే ఉత్త‌ర కొరియా జాతిపిత‌.  గ‌తంలో ఎన్న‌డూ ఈ ఈవెంట్‌కు మిస్ కాని కిమ్ ఈసారి ఆ వేడుక‌ల్లో హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆయ‌న‌పై అనుమానాల‌కు తెర‌లేపింది. ఏప్రిల్ 12వ తేదీన కిమ్ చివ‌రిసారి మీడియా ముందు క‌నిపించారు. వారం క్రితం ఉత్త‌ర కొరియా మిస్సైల్ ప‌రీక్ష చేట‌ప్టింది. కానీ ఆ ఈవెంట్‌కు కూడా కిమ్ హాజ‌రుకాలేదు. సాధార‌ణంగా ఉత్త‌ర కొరియా నుంచి ఎటువంటి వార్త‌లు బ‌య‌ట‌కు రావు. అయితే క‌రోనా నేప‌థ్యంలో జ‌న‌వ‌రి చివ‌రి నుంచే ఆ దేశంలో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. logo